అక్షరటుడే, వెబ్‌డెస్క్: India-US Trade Deal | భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం ఏడాదిన్నరగా చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల ప్రతినిధులు పలుమార్లు సమావేశం అయినా.. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందని ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య కుదిరే తుది ఒప్పందం భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మనం ఒక ఒప్పందం చేసుకోబోతున్నాం. చాలా దగ్గరగా ఉన్నాం అన్నారు. ఇరు దేశాలలోని వ్యాపారాలు, ఎగుమతిదారులు, పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్న ఈ చర్చలలో వాషింగ్టన్ పురోగతిని ఆశిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచించాయి.
India-US Trade Deal | ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం
యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ రంగాల్లో దైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల రూబియో మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా చర్చల దశలో ఉన్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వారాల్లోనే కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ ప్రాప్యతను విస్తరించడం, సుంకాలు, వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులు, నియంత్రణపరమైన అడ్డంకులపై దీర్ఘకాలంగా ఉన్న విభేదాలను పరిష్కరించడం లక్ష్యంగా భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Shashi Tharoor | నేను ట్రావెల్ ఏజెంట్‌ను కాదు.. శశిథరూర్ కీలక వ్యాఖ్యలు