అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Rally | పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, ఖతార్ అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు రేకెత్తిస్తున్నాయి. యుద్ధం ముగిస్తే చమురు సరఫరాకు ఆటంకాలు తొలిగే అవకాశాలు ఉండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
బ్యారెల్ ధర 111 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతోపాటు ఊహించిన దానికంటే మెరుగైన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు సాధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లాయి. దీంతో ప్రధాన సూచీలు సైతం పరుగులు తీశాయి.
Indian Stock Market Rally | లాభాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) నూతన వారాన్ని పాజిటివ్‌గా ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 719 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మొదట్లో 200 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 714 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 15 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 233 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,233 పాయింట్ల లాభంతో 75,692 వద్ద, నిఫ్టీ 388 పాయింట్ల లాభంతో 23,440 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,889 కంపెనీలు లాభపడగా 1,577 స్టాక్స్ నష్టపోయాయి. 226 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 103 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 199 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో, 7 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ 11.64 శాతం, టాటా స్టీల్ 5.64 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.75 శాతం, ఎస్బీఐ 2.71 శాతం, ఎన్టీపీసీ 2.37 శాతం లాభపడ్డాయి.
Top losers : ఇన్ఫోసిస్ 1.61 శాతం, కొటక్ బ్యాంక్ 0.65 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.63శాతం, సన్‌ఫార్మా 0.58 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.47 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Rally | దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధర.. భారీ లాభాల్లో మార్కెట్లు..