Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

తెలంగాణ ప్రభుత్వ వారసత్వ, పర్యాటక శాఖలు, పురావస్తు, చారిత్రక, వారసత్వ పర్యాటక ప్రదేశాలలో టూరిస్ట్ గైడ్ ప్రోగ్రామ్ కోసం తెలంగాణలోని 33 జిల్లాల నుండి పట్టభద్రుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. మంచి సంభాషణా నైపుణ్యాలు కలిగి, పురావస్తు శాస్త్రం, చరిత్ర, వారసత్వం, సంస్కృతి, కళ, వాస్తుశిల్పం, పర్యాటకం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tourist Guide Recruitment | ఇలా దరఖాస్తు చేయాలి

ఆసక్తి గల అభ్యర్థులు https://docs.google.com/forms/d/e/1FAIpQLSdfLenWj-5csepK7CfawDDJEWC21PJaGbDjT8M0wsYS8k_9ww/viewform?pli=1 లింక్​ను క్లిక్​ చేసి దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు, టూరిస్ట్​ గైడ్​గా అనుభవం ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. పాస్​పోర్టు సైజ్​ ఫొటో, డిగ్రీ సర్టిఫికెట్ అప్​లోడ్​ చేయాలి.

దీనిని కూడా చదవండి : Government Job Age Limit | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. వయో పరిమితి పెంచిన ప్రభుత్వం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *