అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rajiv Gandhi Auditorium | నగరంలోని (Nizamabad) రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali) వెల్లడించారు. మంగళవారం నగరంలో ఆయన పర్యటించారు..
Rajiv Gandhi Auditorium | ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో..
జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మంగళవారం 46 మందికి సీఎం సహాయ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం నిధులు అందించాలని ఇదివరకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరించిన జూపల్లి కృష్ణారావును కోరామన్నారు. ఈ మేరకు మంత్రి జూపల్లి పర్యాటక శాఖ ద్వారా రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు.
అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలో గెస్ట్ హౌస్ మరమ్మతులకు, సిద్ధుల గుట్ట కాటేజీ, అతిథి గృహం నిర్మాణాలకు రూ.50 లక్షలు, భీమ్‌గల్ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం అభివృద్ధికి రూ. 4 కోట్ల చొప్పున జిల్లాకు మొత్తం రూ. 5కోట్ల నిధులు మంజూరు చేశారని షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ నిధుల కోసం తనతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కృషి చేశారని తెలుపుతూ, ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహేష్ కుమార్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన ఒరాకిల్