అక్షరటుడే, వెబ్డెస్క్: Student Protest | జార్ఖండ్‌లో పరీక్ష పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నారు. వారి పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో మాట్లాడారు.
జార్ఖండ్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు తాము అండగా నిలుస్తామని తెలిపారు. వారి నిరసనను కొనసాగించమని చెప్పానన్నారు. తాను కూడా అక్కడికి వెళ్తానని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. అది నెరవేరిందని, అయితే కొత్త విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించారన్నారు. బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన వారికి ఆయన పూలమాలలు వేశారని, అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా చేయడాన్ని తాము సమర్థించమన్నారు.
Student Protest | పరిహారం అందలేదు
ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని తాము కోరినట్లు అభిజిత్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరికి పరిహారం రాలేదన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలు, విధివిధానాలను పరిశీలించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పినట్లు తనకు తెలిసిందన్నారు. అమెరికాలో చదువుకోవడానికి దీప్కేకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఇటీవల పలువురు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందించారు. తన విద్యా రుణం (education loan), స్కాలర్‌షిప్ లేఖకు సంబంధించిన పత్రాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఇది కూడా చదవండి..: RBI MPC Meeting | ఈఎంఐ భారం తగ్గేనా?.. అందరి చూపూ ఆర్బీఐ సమావేశంపైనే..