PM Meeting | చమురు ధరలపై నేడు ప్రధాని సమావేశం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Meeting | దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెట్రోల్​, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

ప్రధాని కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్​లో చమురు సరఫరా సమస్యలు, పర్యవసానాలే ప్రధాన అజెండా. పశ్చిమాసియా సంక్షోభం భారంగా మారడంతో పీఎంవో కీలక భేటీ నిర్వహిస్తోంది. వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులతో 7 అధికార బృందాలను ఏర్పాటు చేసింది. చమురు ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రజలపై భారం పడకుండా ఏం చేయాలనే అంశాలపై ఈ మీటింగ్​లో చర్చించనున్నట్లు సమాచారం.

PM Meeting | విపక్షాల విమర్శలు

PM Meeting

దేశంలో ఇంధన ధరల పెంపుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్​ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి. ప్రజల్లో సైతం ఈ నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. దీంతో ప్రధాని కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి..: Kacheguda Sri Ganganagar Express | ఉత్తరాది వెళ్లే వారికి శుభవార్త.. కాచిగూడ -శ్రీగంగానగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ క్రమబద్ధీకరణ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *