Bhu Bharati Project | భూభారతి ప్రాజెక్ట్​లో ఫీల్డ్​ టెక్నికల్​ స్టాఫ్​ సమస్యలు పరిష్కరించాలి

భూ భారతి ప్రాజెక్ట్​ ఫీల్డ్​ టెక్నికల్​ స్టాఫ్​ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Bhu Bharati Project | భూభారతి ప్రాజెక్ట్​లో ఫీల్డ్​ టెక్నికల్​ స్టాఫ్​ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు ప్రజావాణిలో అదనపు కలెక్టర్​ భుజంగరావు (Additional Collector Bhujanga Rao)ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Bhu Bharati Project | ధరణి ప్రాజెక్ట్​ ప్రారంభమైనప్పటి నుంచి..

ఫీల్డ్​ టెక్నికల్​ ఉద్యోగుల(FTS) అసోసియేషన్​ స్టేట్​ ఉమెన్​ వింగ్​ వైస్​ ప్రెసిడెంట్ పసల వసుంధర మాట్లాడుతూ.. ధరణి ప్రాజెక్ట్ అమలులోకి వచ్చినప్పటి నుంచి తాము రెవెన్యూ విభాగానికి నిరంతరాయంగా సాంకేతిక సేవలందిస్తున్నామన్నారు. భూ భారతి ప్రాజెక్ట్​లోనూ తాము పనిచేస్తున్నామని వివరించారు. తహశీల్దార్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, కలెక్టరేట్, ఇతర రెవెన్యూ కార్యాలయాలలో ఆన్‌లైన్ భూ లావాదేవీలను నిర్వహించడం, మ్యుటేషన్ సేవలు, డేటా ధృవీకరణ, పోర్టల్ నిర్వహణ, సాంకేతిక సమస్యల పరిష్కారం అన్నీంటిలోనూ తాము విధులు నిర్వహిస్తున్నామని వివరించారు.

Bhu Bharati Project | ఉద్యోగ భద్రత లేక

Bhu Bharati Project

తమకు రావాల్సిన జీతాలు నెలల తరబడిగా రావట్లేదని ఆమె వాపోయారు. జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. జిల్లావ్యాప్తంగా 33 మంది ఎఫ్​టీఎస్​ సిబ్బందికి నెలవారీగా జీతాలు ఇవ్వాలని.. బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్​ చేశారు. అలాగే సిబ్బంది సేవలను ఎప్పటిలాగే పునురుద్ధరించాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: SRSP Flood Canal | కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ వరద కాలువకు జలకళ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *