UPI Transactions | యూపీఐ జోరు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలు

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్ పేమెంట్స్ అక్టోబర్ నెలలో రికార్డులు సృష్టించింది. తొలిసారిగా యావరేజ్ డైలీ ట్రాన్సాక్షన్స్ వాల్యూ రూ. లక్ష కోట్లను దాటింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI Transactions | అక్టోబర్‌లో యూపీఐ లావాదేవీలు (UPI Transactions) గణనీయంగా పెరిగాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్ పేమెంట్స్ సరికొత్త రికార్డులు సృష్టించాయి. అక్టోబర్ నెలలో మొత్తం జరిగిన లావాదేవీల విలువ రూ.31.53 లక్షల కోట్లుగా నమోదయ్యింది. తద్వారా యావరేజ్ డైలీ ట్రాన్సాక్షన్ వాల్యూ తొలిసారిగా రూ. లక్ష కోట్లను దాటింది. ఈ ఏడాది మే నెలలో గరిష్టంగా రూ.29.9 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. పండుగ సీజన్‌లో వినియోగదారుల వ్యయం పెరగడం ఈ రికార్డులకు దోహదం చేసిందని భావిస్తున్నారు.

రోజూ 821 మిలియన్ల లావాదేవీలు..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం గత నెలలో రూ. 2,547 కోట్ల యూపీఐ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే రోజూ సగటున 821 మిలియన్ల లావాదేవీలు రికార్డయ్యాయి. కాగా సెప్టెంబర్‌లో 2,407 కోట్ల లావాదేవీలు నమోదవగా.. రోజువారీ లావాదేవీల సగటు పరిమాణం 802 మిలియన్లుగా ఉంది.

ఇది కూడా చదవండి..: Supreme Court Airfare | విమానంలో ప్రయాణించొద్దు.. ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *