Supreme Court Airfare | విమానంలో ప్రయాణించొద్దు.. ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు

విమాన ఛార్జీల పెంపుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court Airfare | ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విమాన టికెట్​ ధరలు పెరిగాయని న్యాయవాది వాదించగా.. ఫ్లైట్​లలో ప్రయాణించొద్దని వ్యాఖ్యానించింది.

విమాన ఛార్జీల పెంపుపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టు (Supreme Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. టికెట్ ధరలు 700 శాతం పెరిగాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్ విమాన ప్రయాణం చేయకండని ఆ న్యాయవాదికి సూచించింది. దీంతో ఇది అత్యవసర సేవ అని, రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకోని కోర్టు సరే, ప్రయాణం చేయకండి అంటూ పిటిషన్​ను తిరస్కరించింది.

ఇది కూడా చదవండి..: Congress Rally | కాంగ్రెస్​ ర్యాలీ ఏఐ ఫొటోలపై కేంద్ర మంత్రి విమర్శలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *