Ganesh Bigala BRS | బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉద్ధృతంగా చేపట్టాలి : మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ganesh Bigala BRS | భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా నిజామాబాద్ నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపునిచ్చారు.

నిజామాబాద్​ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం డివిజన్ ఇంఛార్జులు, ముఖ్య నాయకులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే సభ్యత్వ నమోదు ప్రక్రియపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

Ganesh Bigala BRS | డిజిటల్ సభ్యత్వ నమదు

ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని, దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రతి బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు సమర్థవంతంగా చేపట్టాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రికార్డు స్థాయిలో సభ్యత్వాలు చేయించాలని సూచించారు.

Ganesh Bigala BRS | ప్రజల్లోకి గత సంక్షేమ పథకాలు:

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలను వివరించాలని కోరారు.

ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేసి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమమే పార్టీ విజయాలకు పునాది కావాలని గణేష్ బిగాల పేర్కొన్నారు.

ఈ సన్నాహక సమావేశంలో పలువురు డివిజన్ ఇంఛార్జులు, పార్టీ ముఖ్య నాయకులు, ఉత్సాహవంతులైన కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకుంటామని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు.

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *