అక్షరటుడే వెబ్‌డెస్క్: Rozgar Mela 2026 | దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 20వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi )కొత్తగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు (అపాయింట్‌మెంట్ లెటర్లు) అందజేయనున్నారు.
Rozgar Mela 2026 | వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ..
అధికారిక సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ వేడుకలో ప్రధాని మోడీ స్వయంగా పాల్గొని, దేశవ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులతో మాట్లాడనున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా మొత్తం 45 ప్రాంతాల్లో ఒకేసారి ఈ రోజ్‌గార్ మేళా నిర్వహించనున్నారు.
Rozgar Mela 2026 | ఏయే శాఖల్లో నియామకాలు?
ఈ విడతలో ఎంపికైన యువత కేంద్ర ప్రభుత్వంలోని రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటి వివిధ ప్రముఖ మంత్రిత్వ శాఖలు మరియు కీలక విభాగాల్లో కొలువుదీరనున్నారు.
Rozgar Mela 2026 | 12.75 లక్షలకు ఉద్యోగాల సంఖ్య..
యువతకు ఉపాధి అవకాశాలను మరింత విస్తృతం చేయడం, దేశ అభివృద్ధి ప్రయాణంలో వారిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజ్‌గార్ మేళా వేడుకలను కొనసాగిస్తోంది. తాజా 20వ విడతతో కలిపి ఇప్పటివరకు ఈ వేదిక ద్వారా ఉద్యోగాలు పొందిన యువత సంఖ్య సుమారు 12.75 లక్షలకు చేరుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Danam Nagender Disqualification | దానం నాగేందర్‌కు హైకోర్టులో బిగ్ షాక్.. అనర్హత వేటు వేస్తూ తీర్పు