Rahul Gandhi | రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం.. మాట మార్చారంటూ జితేంద్ర సింగ్ విమర్శలు

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరుల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ధర్నా ప్రదేశంలో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరుల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ధర్నా ప్రదేశంలో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను క్షణాల్లో మార్చడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

Rahul Gandhi | కొత్త డిమాండ్లు తెరపైకి..

నిరసనలకు కేటాయించని స్థలంలో ధర్నా చేపట్టడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. కాంగ్రెస్ అగ్రనేతల హోదాను గౌరవిస్తూ కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కూడిన ప్రతినిధి బృందాన్ని నేరుగా ధర్నా స్థలానికి పంపినట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. ఆందోళన విరమించాలని కోరగా.. నీట్ (NEET) పరీక్ష అక్రమాలు, విద్యార్థుల ఉద్యమంపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం ఒప్పుకుంటే వెంటనే ధర్నా విరమిస్తామని రాహుల్ గాంధీ షరతు విధించారన్నారు. ప్రభుత్వ పెద్దల అనుమతి తీసుకున్న ప్రతినిధి బృందం.. నీట్ వివాదంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధమని తక్షణమే హామీ ఇచ్చిందని చెప్పారు. అయితే, కేంద్రం నుంచి హామీ లభించిన మరుక్షణమే రాహుల్ గాంధీ తన మాట మార్చారని ఆరోపించారు. కేవలం పార్లమెంట్‌లో చర్చ మాత్రమే కాకుండా, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలనే మరో కొత్త డిమాండ్‌ను ఆయన తెరపైకి తెచ్చారని వెల్లడించారు.

Rahul Gandhi | రాహుల్ వ్యాఖ్యలపై విమర్శలు..

ముందుగా ఇచ్చిన మాట ప్రకారం చర్చకు ఒప్పుకున్నాక, ఇలా మాట మార్చడం తగదని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. “నా డిమాండ్లు మార్చుకోవడం నా ఇష్టం” అని రాహుల్ బదులిచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా, నిరసనలకు ఇది సరైన స్థలం కాదని హోం కార్యదర్శి వివరించగా.. “ఎక్కడ కూర్చోవాలో నిర్ణయించుకోవడం కూడా నా ఇష్టమే” అంటూ ఆయన జవాబిచ్చినట్లు జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వివరించారు.

ఇది కూడా చదవండి: Nizamabad City | వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *