Stock Market Rally | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. భారీ లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల బాటలో పయనిస్తోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 774 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Rally | మధ్యంతర ఎన్నికల తర్వాతే ఇరాన్‌పై దాడి జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొనడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తోంది. దీనికితోడు టీసీఎస్ రెండో త్రైమాసిక ఫలితాలు బాగుండడంతో ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో ప్రధాన సూచీలు పరుగులు తీస్తున్నాయి.

Stock Market Rally | లాభాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 183 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మొదట్లో 37 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 763 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా మొదట్లో 20 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 240 పాయింట్లు పైకి ఎగబాకింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 774 పాయింట్ల లాభంతో 72,367 వద్ద, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో 22,493 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 26 స్టాక్స్ లాభాలతో, 4 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. టీసీఎస్ 5 శాతం, ఐటీసీ 3.17 శాతం, అదానీపోర్ట్స్ 2.88 శాతం, ఇన్ఫోసిస్ 2.77 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.28 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఐసీఐసీఐ బ్యాంక్ 0.44 శాతం, రిలయన్స్ 0.34 శాతం, ఎటర్నల్ 0.31 శాతం, బీఈఎల్ 0.30 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Gold and Silver Prices | ఢిల్లీలో 24 క్యారెట్‌ 10 గ్రాముల పసిడికి రూ.1.50 లక్షల పైమాటే!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *