Nizamabad Fire Accident | నగరంలో విషాదం.. అగ్నిప్రమాదంలో గాయపడ్డ తండ్రీకొడుకులు మృతి

ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోగా గాయపడ్డ తండ్రీకొడుకులు ఇద్దరు మృతి చెందారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం: Nizamabad Fire Accident | నగరంలో (Nizamabad) విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోగా గాయపడ్డ తండ్రీకొడుకులు ఇద్దరు మృతి చెందారు.

Nizamabad Fire Accident | పూలాంగ్​ సమీపంలోని హనుమాన్​ నగర్​లో..

నగరంలోని పూలాంగ్​ సమీపంలోని హనుమాన్​ నగరంలో గతనెల 26న తెల్లవారజామున ఫజల్​ఖాన్​ ఇంట్లో షార్ట్​సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ క్రమంలో తండ్రి ఫజల్​ఖాన్​, కొడుకు షాజ్​ఖాన్​ ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. ఫజల్​ఖాన్​ చికిత్స పొందుతూ మరణించగా.. షాజ్​ఖాన్​ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందారు. అగ్నిప్రమాద ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *