అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Transport Department Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రవాణా శాఖలో భారీగా ఉద్యోగులను బదిలీ చేసింది. చాలా కాలంగా ఒకే చోట పని చేస్తున్న వారికి స్థానచలనం కలిగింది.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో బదిలీలకు ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని శాఖల అధికారులు, సిబ్బంది బదిలీల ప్రక్రియ పూర్తయింది. తాజాగా రవాణా శాఖలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల (ఏఎంవీఐ)ను ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
Transport Department Transfers | రెండు మల్టీజోన్ల పరిధిలో..
మల్టీ జోన్ 1 పరిధిలో 41 మంది ఎంవీఐలు, 42 మంది ఏఎంవీఐలు బదిలీ అయ్యారు. మల్టీ జోన్–2 పరిధిలో 52 మంది ఎంవీఐలు, 40 మంది ఏఎంవీఐలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఉద్యోగుల అభ్యర్థన, స్పౌస్, ఇతర కారణాలతో బదిలీలు చేపట్టారు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రవాణా శాఖలోని ఐదు జోన్ల పరిధిలో పని చేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Data Centers | ఐటీ హబ్‌గానే కాదు.. డేటా సెంటర్ ‘పవర్ హౌస్’గానూ హైదరాబాద్ జోరు!


