Burgupalli Rathotsavam | బూర్గుపల్లిలో ఘనంగా రథోత్సవం

Srinivas Kolluri

అక్షరటుడే, మెదక్​ : Burgupalli Rathotsavam | మెదక్​ (Medak) జిల్లా హవేళి ఘన్​పూర్​ మండలం బూర్గుపల్లిలో సోమవారం తెల్లవారు జామున రథోత్సవం నిర్వహించారు. గ్రామంలో నాలుగు రోజులుగా ఉత్సవాలు సాగుతున్నాయి.

మూడు రోజుల పాటు గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున నల్లపోచమ్మ ఆలయం (Nalla Pochamma Temple) వద్ద రథాన్ని తింపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి తరలి వచ్చారు. అమ్మవారికి పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్​ సాయిలు, ఉప సర్పంచ్​ లెంక రాజు, కాంగ్రెస్​ నాయకుడు చిట్యాల శ్రీనివాస్​, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

burgupalli

దీనిని కూడా చదవండి : Telangana Education Performance | విద్యా రంగంలో తెలంగాణకు మెరుగైన గుర్తింపు.. కేంద్ర పీజీఐ నివేదికపై సీఎం హర్షం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *