అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Education Performance | విద్యా రంగ అభివృద్ధిని ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తీసుకుని గత రెండేళ్లుగా చేపట్టిన చర్యలకు ఫలితాలు కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన “పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)” నివేదికలో పాఠశాల విద్యలో తెలంగాణ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన అన్నారు.

Telangana Education Performance | సమాజాన్ని జాగృతం చేసే శక్తి
విద్యే అభివృద్ధికి తొలి కొలబద్ద అని, పేదరిక నిర్మూలనతో పాటు సమాజాన్ని జాగృతం చేసే శక్తి విద్యకు మాత్రమే ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
విద్యా శాఖ బాధ్యతలను స్వయంగా తన వద్ద ఉంచుకుని ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, మౌలిక వసతుల మెరుగుదల, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అంశాలపై ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేసిందని వివరించారు.
Telangana Education Performance | అగ్రస్థానంలో తెలంగాణ
గత పదేళ్లలో విద్యా రంగంలో ఏర్పడిన వెనుకబాటుతనాన్ని అధిగమించి, విద్యా వికాసానికి పునాది వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అయితే తాజా ఫలితాలతో సంతృప్తి చెందకుండా మరింత ఉన్నత లక్ష్యాలతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు భవిష్యత్తులో దేశ విద్యా వ్యవస్థలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర నివేదికలో నమోదైన తాజా పురోగతి ఆ లక్ష్య సాధనకు మరింత ప్రేరణనిచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Japan Mango Export Ban | పాలకుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం…..


