అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Cold Wave | రాష్ట్రంలో నేటి నుంచి చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చలిగాలులు వీస్తాయన్నారు.
చలికాలం మొదలై 20 రోజులు దాటుతున్నా.. తెలంగాణ (Telangana)లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటిపూట ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఈ నెల 26న అర్నాబ్ అనే తుపాన్ ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఉత్తర దిశ నుండి వీచే పొడి గాలులు వీస్తాయి. ఫలితంగా అక్టోబర్ 25, 26, 27 తేదీలలో తెలంగాణలో రాత్రులు చల్లగా ఉంటాయి. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
Telangana Cold Wave | పలు జిల్లాలకు వర్ష సూచన
అర్నాబ్ తుపాన్ ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉండనుంది. తుపాను అక్టోబర్ 28న మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుంది. 28న మధ్యాహ్నం నుంచి అక్టోబర్ 29 మధ్యాహ్నం వరకు భద్రాద్రి, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ప్రభావం అంతగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Shamshabad Airport Currency Seizure | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత