అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jio Platforms IPO | రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో (IPO) అద్భుతాలు సృష్టించింది. దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా వచ్చిన ఈ కంపెనీ.. రికార్డు స్థాయిలో బిడ్లను ఆకర్షించింది. జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్‌నుంచి రూ. 30,213 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని సమీకరించడం కోసం ఈనెల 21నుంచి 23 వరకు సబ్‌స్క్రిప్షన్ స్వీకరించగా.. రూ. 4.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.
Jio Platforms IPO | యాంకర్ ఇన్వెస్టర్లతో కలిపితే..
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోలో యాంకర్ ఇన్వెస్టర్లకు సుమారు రూ. 8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. వీటికోసం దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌తో యాంకర్ బుక్‌ను కలుపుకుంటే మొత్తం బిడ్ అమౌంట్ రూ. 7 లక్షల కోట్లకు చేరింది. తద్వారా భారతదేశంలోనే అతిపెద్ద షేర్ల విక్రయమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో).. ఇన్వెస్టర్ల డిమాండ్‌లో కొత్త రికార్డును నెలకొల్పింది. ఇది భారతదేశ ప్రైమరీ మార్కెట్‌కు ఒక మైలురాయిగా నిలిచింది.
ఇది కూడా చదవండి..: Benelli TRK 552 | భారత్‌లో కొత్త బెనెల్లీ ‘TRK 552, TRK 552X’ బైక్‌లు విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!