Motorola Edge 70 Pro Plus | మోటోనుంచి మరో ప్రీమియం ఫోన్.. ధర రూ.47,999!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Motorola Edge 70 Pro Plus | ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో మరో మోడల్‌ను యాడ్ చేసింది. ఎడ్జ్ 70 ప్రో ప్లస్ పేరిట ప్రీమియం సెగ్మెంట్‌లో అత్యాధునిక ప్రాసెసర్, భారీ బ్యాటరీతో దీనిని తీసుకువచ్చారు. గురువారం (జూన్ 11) నుంచి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మోటోరోలా వెబ్‌సైట్, సంబంధిత రిటైల్ స్టోర్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీని స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.8 అంగుళాల 1.5 కే సూపర్ హెచ్డీ ప్లస్ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇస్తుంది. మిలిటరీ గ్రేడ్ డ్యూరెబిలిటీ, ఐపీ68, ఐపీ69 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ ఉంది.

Motorola Edge 70 Pro Plus | బ్యాటరీ సామర్థ్యం..

6500 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90డబ్ల్యూ వైర్డ్ టర్బో చార్జింగ్, 15డబ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Motorola Edge 70 Pro Plus | కెమెరా సెటప్..

వెనకవైపు సోనీ ఎల్‌వైటీ710తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 50ఎంపీ టెలిఫొటో కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్, మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ముందువైపు 50ఎంపీ కెమెరా ఇచ్చారు.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలోయూఐ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. 3ఏళ్లపాటు ఓఎస్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

సింగిల్ వేరియంట్ : ఈ ఫోన్ పాంటోన్ జిన్‌ఫాండల్, స్టార్మీ సీ, చికోరీ కాఫీ రంగుల్లో సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. 12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.47,999.

కార్డ్ ఆఫర్లు : యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో చేసే కొనుగోళ్లపై రూ. 3 వేల వరకు తక్షణ తగ్గింపు వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి..: డెలివరీ భాగస్వాములపై మానవత్వం: ఇండస్‌ఇండ్ జనరల్ ఇన్సూరెన్స్ ‘ఏక్ గ్లాస్ పానీ’ సరికొత్త ప్రచారం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *