Jio IPO | ‘జియో’ ఐపీవోకు భారీ స్పందన

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన లభించింది. మొత్తం ఇష్యూ 17.81 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ మార్కెట్‌నుంచి రూ. 30,213 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఇది దేశంలోనే అతి పెద్ద పబ్లిక్‌ ఇష్యూ అయినప్పటికీ ఇన్వెస్టర్లనుంచి మంచి స్పందన కనిపించింది.

Jio IPO | 21న ప్రారంభమైన సబ్స్క్రిప్షన్..

జియో పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 21న ప్రారంభమైంది. 23న సాయంత్రం 5 గంటల వరకు బిడ్లను ఆహ్వానించారు. రిలయన్స్ నుంచి సుమారు రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన ఐపీవోను మదుపరులు ఆదరించారు. ఐపీవో (IPO) మొత్తం ఇష్యూ 20.58 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీలు 64.07 రెట్లు, సంస్థాగతేతర పెట్టుబడిదారులు 13.95 రెట్లు, రిటైల్ పెట్టుబడిదారులు 2.74 రెట్లు, ఉద్యోగులు 2.90 రెట్లు, వాటాదారులు 7.56 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

Jio IPO | జీఎంపీ 24 శాతం..

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు శుక్రవారం జీఎంపీ రూ. 252 గా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో 22 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Jio Platforms IPO | రూ. 30 వేల కోట్ల ఐపీవో.. రూ. 4.5 లక్షల విలువైన బిడ్లు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *