అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lohia Corp IPO | లోహియా కార్ప్ అనేది నేసిన పాలీప్రొపైలిన్, హెచ్డీపీఈ టెక్నికల్ టెక్స్‌టైల్ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే యంత్రాల తయారీలో ప్రపంచంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. దీనిని 2023లో స్థాపించారు. ఈ కంపెనీ రాఫియా ప్యాకేజింగ్, ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్‌లు, జియోటెక్స్‌టైల్స్, ఎఫ్ ఐబీసీలు, కంటైనర్ లైనర్‌లు తదితర టెక్నికల్ టెక్స్‌టైల్ అప్లికేషన్‌ల కోసం పూర్తి తయారీ పరిష్కారాలను అందిస్తుంది.
Lohia Corp IPO | 90కి పైగా దేశాలలో కార్యకలాపాలు..
లోహియా కార్ప్ (Lohia Corp) తన ప్రపంచవ్యాప్త అమ్మకాలు, సేవ మరియు గిడ్డంగి నెట్‌వర్క్ కలిగి ఉంది. ఇది 90కి పైగా దేశాలలో ప్యాకేజింగ్ , నాన్-ప్యాకేజింగ్ పరిశ్రమలలోని వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ప్రధానంగా టేప్ ఎక్స్‌ట్రూషన్ లైన్లు, సర్క్యులర్ వీవింగ్ లూమ్‌లు, వైండింగ్ సిస్టమ్‌లు, కోటింగ్ మరియు లామినేషన్ లైన్లు, ప్రింటింగ్ మరియు కన్వర్షన్ మెషీన్లు, మల్టీఫిలమెంట్ నూలు యంత్రాలు, మోనోఫిలమెంట్ ఎక్స్‌ట్రూషన్ లైన్లు, రీసైక్లింగ్ సిస్టమ్‌లు, విడిభాగాలతో సహా అధునాతన యంత్రాలను డిజైన్ చేయడంతోపాటు తయారు చేసి, సరఫరా చేస్తుంది. 2026 మార్చి 31 నాటికి 2,010 మంది శాశ్వత ఉద్యోగులున్నారు.
Lohia Corp IPO | రూ. 1,101.28 కోట్ల సమీకరణ కోసం..
మార్కెట్ నుంచి రూ. 1,101.28 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో లోహియా కార్ప్ ఐపీవోకు వస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరుగుతుంది.
Lohia Corp IPO | ప్రైస్ బ్యాండ్ ..
ఒక్కో షేరు ధరన” రూ. 404 నుంచి రూ. 425గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు 35 షేర్లు గల ఒక లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గరిష్ట ధర వద్ద కనీసం 14,875 పెట్టుబడి అవసరం అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్లకోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 75 శాతం, ఎనఐఐలకు 15 శాతం, .రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటాను కేటాయించారు. గ్రే మార్కెట్‌లో ఒక్కో ఈక్విటీ షేరు 9 శాతం ప్రీమియంతో ఉంది.
ముఖ్యమైన తేదీలు : జూలై 23న ఐపీవో ప్రారంభమవుతుంది. బిడ్డింగ్‌కు జూలై 27 వరకు గడువుంది. అలాట్‌మెంట్ స్టేటస్ 28న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు జూలై 30న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Indo MIM IPO | ఇన్వెస్టర్లను ఊరిస్తున్న ఐపీవో.. 40 శాతానికిపైనే జీఎంపీ!