Indo MIM IPO | ఇన్వెస్టర్లను ఊరిస్తున్న ఐపీవో.. 40 శాతానికిపైనే జీఎంపీ!

ప్రైమరీ మార్కెట్‌లో ప్రవేశం కోసం ఇండో - ఎంఐఎం లిమిటెడ్ కంపెనీ రెడీ అయ్యింది. గ్రే మార్కెట్ ప్రీమియం బాగుండడంతో ఈ కంపెనీ ఐపీవోపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indo MIM IPO | ఇండో – ఎంఐఎం లిమిటెడ్ కంపెనీని 1996లో స్థాపించారు. ఇది మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్ (ఎంఐఎం) సాంకేతికతను ఉపయోగించి ఖచ్చితమైన ఇంజినీరింగ్ భాగాలను తయారు చేస్తుంది.

ఆటోమోటివ్, రక్షణ, వైద్య, వినియోగదారు, ఏరోస్పేస్ రంగాల కోసం మోల్డ్ డిజైన్, టూలింగ్, ఫినిషింగ్, అసెంబ్లీలతో సహా పూర్తి స్థాయి సొల్యూషన్స్ అందిస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ కాస్టింగ్, ప్రెసిషన్ మెషినింగ్, సిరామిక్ ఇంజెక్షన్ మోల్డింగ్, 3డీ మెటల్ ప్రింటింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి అనేక రకాల పరిశ్రమల అవసరాలను తీరుస్తుంది.

Indo MIM IPO | 6,400లకుపైగా ఉత్పత్తులు..

ఈ సంస్థ ఫ్యుయల్ సిస్టమ్స్, పవర్‌ట్రెయిన్స్, ట్రిగ్గర్స్, హ్యామర్స్, సైట్స్, క్రాస్‌బోలు, సెల్‌ఫోన్ భాగాలు, టూల్స్, నాజిల్స్, లాకింగ్ రింగ్స్, క్లెవిస్‌లు.. ఇలా మరెన్నో ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇండో – ఎంఐఎం లిమిటెడ్ కంపెనీ 6,400కుపైగా ఉత్పత్తులను తయారు చేసింది. భారతదేశం, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, మెక్సికోలలో 15 తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. చైనా, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్‌లో 3 సేల్స్ కార్యాలయాలున్నాయి. ఈ సంస్థ వెయ్యికిపైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

Indo MIM IPO | రూ. 3,811 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో..

ఈ కంపెనీ రూ. 3,811.21 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 1 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1,03,09,278 షేర్లను విక్రయించి రూ. 499 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 1 ఫేస్ వ్యాల్యూ కలిగిన 6,82,91,022 షేర్లను విక్రయించి రూ. 3,311 కోట్లు సమీకరించాలని భావిస్తుంది. ఐపీవో (IPO) ద్వారా సమకూరిన ఆదాయాన్ని కంపెనీ తీసుకున్న రుణాలను పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ చెల్లించడం కోసం, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Indo MIM IPO | ప్రైస్ బ్యాండ్..

ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 461 నుంచి రూ. 485 లుగా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్‌లో 30 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,550 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రిటైల్ కేటగిరిలో గరిష్టంగా 13 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Indo MIM IPO | కోటా, జీఎంపీ..

క్యూఐబీలకు 50 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం, .రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటాను కేటాయించారు. ఇండో – ఎంఐఎం లిమిటెడ్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఈక్విటీ షేరు 40 శాతం ప్రీమియంతో ఉంది. జీఎంపీ బాగుండడడంతో ఐపీవో అలాట్ అయ్యేవారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Indo MIM IPO | ముఖ్యమైన తేదీలు..

జూలై 23న ఐపీవో ప్రారంభమవుతుంది. బిడ్డింగ్‌కు జూలై 27 వరకు గడువుంది. అలాట్‌మెంట్ స్టేటస్ 28న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు జూలై 30న బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాల్లో సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *