Hyundai Car Offers | హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyundai Car Offers | దేశీయ ఆటోమోబైల్ రంగంలో పోటీని తట్టుకోవడానికి కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చింది.

పలు మోడళ్లపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ప్రయోజనాలు, అప్‌గ్రేడ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందామా..

Hyundai Car Offers | క్రెటాపై రూ. 1.05 లక్ష వరకు ఆఫర్లు..

మిడ్‌సైజ్ ఎస్‌యూవీ క్రెటాపై హ్యుందాయ్ కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ మోడల్ కారు పెట్రోల్ వేరియంట్ కొనేవారికి గరిష్టంగా రూ. 1.05 లక్షల వరకు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలు, అప్‌గ్రేడ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు కలిపి ఉంటాయి. ఎలక్ట్రిక్ వేరియంట్‌పై రూ. 85వేల వరకు బెనిఫిట్స్ ఉంటాయి.

Hyundai Car Offers | ఇతర మోడళ్లపై..

Hyundai Car Offers

  • వెర్నా పాత వెర్షన్లపై రూ.95 వేలు, అప్‌డేటెడ్ మోడల్‌పై రూ. 55 వేల వరకు ఆఫర్లున్నాయి.
  • గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 78 వేల వరకు, ఐ20, ఐ20 ఎన్‌లైన్‌పై రూ.63 వేల వరకు ప్రయోజనాలు అందనున్నాయి.
  • అల్కజార్‌పై రూ.75 వేలు, ఎక్స్‌టర్ పై రూ.43 వేలు, ఆరాపై రూ.25 వేల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
  • వెన్యూపై రూ.5 వేల వరకు స్క్రాపేజ్ ప్రయోజనాలను ఈ కంపెనీ అందిస్తోంది.

మోడల్ ఆధారంగా రూ.65 వేల వరకు అప్‌గ్రేడ్ బోనస్‌తో పాటు వంద శాతం వరకు ఆన్‌రోడ్ ఫండింగ్, ప్రాసెసింగ్ ఫీజులో రాయితీలు, ఫోర్‌క్లోజర్ చార్జీల మినహాయింపు వంటి ఫైనాన్స్ ఆఫర్లూ ఉన్నాయి. మోడల్, వేరియంట్, నగరం, డీలర్ స్టాక్‌ను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉంటాయి. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే అమలులో ఉండనున్నాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ కోసం సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించండి.

ఇది కూడా చదవండి..: June 06 Gold Prices | గోల్డ్​ లవర్స్​కి స్వల్ప ఊరట.. కాస్త తగ్గిన ధర.. అదే బాటలో వెండి!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *