Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మధ్యాహ్నం 12.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 28 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | చాలా కాలంగా ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉండడంతో ద్రవ్యోల్బణ భయాలు వెన్నాడుతున్నాయి. ఇన్ఫ్లెషన్ అదుపులో లేకపోతే ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయవచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ద్రవ్య విధానంపై నిర్ణయం తీసుకోవడానికి యూఎస్ ఫెడ్ ఈనెల 27, 28 తేదీల్లో సమావేశం కానుంది. ఈసారి యూఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనా వేస్తున్నప్పటికీ.. ద్రవ్యోల్బణం అదుపులో లేకపోతే తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Stock Market | కోలుకున్న మార్కెట్లు..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 133 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మరో 476 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 137 పాయింట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. కనిష్టాల వద్ద వాల్యూ బయ్యింగ్‌తో ప్రధాన సూచీలు పైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 977 పాయింట్లు, నిఫ్టీ 319 పాయింట్లు పెరిగాయి. మధ్యాహ్నం 12.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 72,995 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 22,582 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 13 స్టాక్స్ లాభాలతో, 17 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఎటర్నల్ 2.51 శాతం, కొటక్ బ్యాంక్ 2.07 శాతం, అదానీపోర్ట్స్ 1.73 శాతం, ట్రెంట్ 1.05 శాతం, ఇండిగో 0.54 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్ ఫైనాన్స్ 1.23 శాతం, ఆసియన్ పెయింట్ 1.16 శాతం, ఇన్ఫోసిస్ 1.13 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.84 శాతం, హెచ్యూఎల్ 0.77 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Oct 26 Market Analysis | నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *