అక్షరటుడే వెబ్‌డెస్క్: AU Small Finance Bank | భారతదేశంలోనే అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా, యూనివర్సల్ బ్యాంక్‌గా ( Universal Bank ) మారేందుకు ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కీలక మైలురాయిని సాధించింది. తన ప్రధాన ‘వీల్స్’ (వెహికల్ ఫైనాన్స్) వ్యాపారం రూ.50,000 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) మార్కును దాటినట్లు బ్యాంక్ ప్రకటించింది. భారతదేశ మొబిలిటీ, పారిశ్రామికవేత్తల ప్రయాణానికి దాదాపు మూడు దశాబ్దాలుగా అందిస్తున్న మద్దతుకు ఈ ఘనత నిదర్శనమని తెలిపింది.
గత ఆగస్టు నాటికి ఈ వీల్స్ పోర్ట్‌ఫోలియో రూ.50 వేల కోట్ల ఏయూఎంను దాటడంతో ఈ రికార్డు నమోదైంది. ఈ ఫ్రాంచైజీ 3 సంవత్సరాల సీఏజీఆర్ 26%, 5 సంవత్సరాల సీఏజీఆర్ 29% వృద్ధిని నమోదు చేస్తూ స్థిరమైన ప్రగతిని సాధించింది. రాజస్థాన్‌లో స్వయం ఉపాధి పొందుతున్న పారిశ్రామికవేత్తలు, రవాణాదారులకు చేయూతనిచ్చేందుకు 1996లో ప్రారంభమైన ఈ ప్రయాణం.. నేడు దేశవ్యాప్తంగా అగ్రగామి వెహికల్-ఫైనాన్స్ ఫ్రాంచైజీలలో ఒకటిగా ఎదిగింది.
AU Small Finance Bank | వివిధ రంగాలకు ఆర్థిక చేయూత..
గత మూడు దశాబ్దాలుగా రవాణా ఆపరేటర్లు, రైతులు, కాంట్రాక్టర్లు, ట్యాక్సీ యజమానులు, చిన్న వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలకు ఉత్పాదక ఆస్తులను సమకూర్చుకోవడంలో ఏయూ బ్యాంక్ అండగా నిలుస్తోంది. కొత్త, పాత వాహనాల ఫైనాన్సింగ్‌లో బలమైన నైపుణ్యాన్ని సంపాదించుకున్న ఈ సంస్థ.. ప్రస్తుతం కొత్త వాహనాల ఫైనాన్స్ కింద రూ.30,752 కోట్లు, పాత వాహనాల ఫైనాన్స్ కింద రూ.17,966 కోట్లు, టూ-వీలర్ ఫైనాన్స్ కింద రూ.1,767 కోట్ల పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా సర్వీస్ టచ్‌పాయింట్లతో తన సేవలను విస్తరించింది.
AU Small Finance Bank | ప్రజల ఆకాంక్షలకు అండగా..
ఈ మైలురాయిపై ఏయూ ఎండీ & సీఈఓ సంజయ్ అగర్వాల్ స్పందిస్తూ.. కష్టపడి పనిచేసే వ్యక్తులకు మద్దతు ఇవ్వాలన్న నమ్మకంతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 13 లక్షలకు పైగా కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొందని తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్న తరుణంలో బాధ్యతాయుతమైన లెండింగ్ ద్వారా ప్రజల ఆకాంక్షలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. డిజిటల్ మార్పుల్లో భాగంగా లెండింగ్ ఆపరేషన్స్‌లో ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధారిత సామర్థ్యాలను అనుసంధానిస్తున్నామని, యూనివర్సల్ బ్యాంక్‌గా మారే ప్రయాణంలో ఈ వీల్స్ ఫ్రాంచైజీ ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Asian Games | ఆసియా గేమ్స్.. షూటింగ్లో భారత్‌కు మరో పతకం