అక్షరటుడే వెబ్‌డెస్క్: Jolarpet Train Derailment | తమిళనాడులోని ( Tamil Nadu )తిరుపత్తూరు జిల్లాలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం తాలూకు విచిత్ర ఘటన వెలుగు చూసింది. జోలార్‌పేట జంక్షన్ రైల్వే యార్డులో నిలిపి ఉంచిన ఏడు ఖాళీ రైలు బోగీలు ఎలాంటి ఇంజిన్ లేకుండానే అకస్మాత్తుగా ముందుకు కదిలాయి. పట్టాలపై వేగంగా జారుకుంటూ ఏకంగా 6 కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఈ బోగీలు.. తామలేరి ముత్తూరు సమీపంలోని ప్రధాన రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని పట్టాలు తప్పాయి.
Jolarpet Train Derailment | తప్పిన పెను ప్రమాదం..
ఈ బోగీలు ఖాళీగా ఉండటం , ఆ సమయంలో ఆ మార్గంలో వేరే రైళ్లు రాకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, బెంగళూరు – చెన్నై ప్రధాన మార్గంలో ఈ ఘటన జరగడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కీలక ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు మార్గమధ్యంలోని వివిధ స్టేషన్లలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
Jolarpet Train Derailment | సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సహాయక బృందాలు గ్యాస్ కట్టర్ల సాయంతో ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న బోగీలను వేరు చేశాయి. అనంతరం జేసీబీ యంత్రాలను రంగంలోకి దించి ట్రాక్‌ను క్లియర్ చేసే పనులను ముమ్మరం చేశాయి.
Jolarpet Train Derailment | విచారణకు ఆదేశం..
యార్డులో నిలిపి ఉంచిన బోగీలకు సరైన హ్యాండ్‌బ్రేకులు వేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందా లేక సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే కోణంలో రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ తప్పిదానికి కారణమైన సిబ్బందిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Rajasthan Electric Shock | రోడ్డు పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు మృతి