Rajasthan Electric Shock | రోడ్డు పనుల్లో కరెంట్​ షాక్​.. 8 మంది కార్మికులు మృతి

రోడ్డు పనుల్లో భాగంగా విద్యుత్​ షాక్​ తగిలి 8 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్​లో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Rajasthan Electric Shock | రాజస్థాన్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పనుల్లో భాగంగా భారీ యంత్రానికి విద్యుత్​ తీగలు తగలడంతో.. కరెంట్​ షాక్​తో 8 మంది కార్మికులు మృతి చెందారు.

రాజస్థాన్‌ (Rajasthan)లోని ఝున్‌ఝును జిల్లా చపోలిలో రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం రహదారి నిర్మాణ సామగ్రిని కలిపే యంత్రం (మిక్సింగ్ మెషీన్) 11 వేల వోల్టుల విద్యుత్​ తీగలకు తగిలింది. దీంతో సమీపంలో పని చేస్తున్న కార్మికులకు షాక్​ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Rajasthan Electric Shock | నలుగురికి తీవ్రగాయాలు

ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి ఖచ్చితమైన సంఖ్యపై అధికారిక ధృవీకరణ ఇంకా అందాల్సి ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించారు.\

ఇది కూడా చదవండి..: INDIA Alliance Rally | ఇండియా కూటమి ర్యాలీతో రూ.11 వేల కోట్ల నష్టం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *