అక్షరటుడే వెబ్డెస్క్: Govind Mohan | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్’ (DoPT) బుధవారం అధికారిక ప్రకటన వెలువరించింది.
Govind Mohan | పదవీకాలం పెంపు వివరాలు..
ఈ ఉత్తర్వుల ప్రకారం, 2026 ఆగస్టు 22తో ముగియాల్సిన ఆయన పదవీకాలం.. 2027 ఆగస్టు 22 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పొడిగించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలకు తగిన మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగ కార్యదర్శి మనీషా సక్సేనా ఈ ఉత్తర్వులపై సంతకం చేసి అధికారికంగా విడుదల చేశారు.
The Appointments Committee of the Cabinet has approved the extension of Home Secretary Govind Mohan’s service for a period of one year beyond August 22, 2026, up to August 22, 2027, or until further orders pic.twitter.com/H6rkXFT877
— IANS (@ians_india) August 5, 2026
ఇది కూడా చదవండి: Tamil Nadu Budget | విజయ్ సర్కార్ తొలి బడ్జెట్.. రూ. 4.11 లక్షల కోట్లతో భారీ కేటాయింపులు..ఏ రంగానికి ఎంతంటే..