Nizamabad Ganesh Immersion Route | గణేష్​ నిమజ్జన మార్గాన్ని పరిశీలించిన మేయర్​

నగరంలో గణపతి నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని మేయర్​ కూరగాయల ఉమారాణి తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Ganesh Immersion Route | నగరం (Nizamabad)లో గురువారం జరగనున్న గణపతి నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని మేయర్​ కూరగాయల ఉమారాణి తనిఖీ చేశారు. మున్సిపల్​ కమిషనర్​ దిలీప్​కుమార్​తో కలిసి ఆమె రథయాత్ర ప్రారంభం కానున్న దుబ్బ నుంచి గణపతుల బావి వరకు రోడ్డుమార్గాన్ని పరిశీలించారు.

Nizamabad Ganesh Immersion Route | భక్తులకు ఇబ్బందుల్లేకుండా..

Nizamabad Ganesh Immersion Route

మేయర్​ రథయాత్ర మార్గంలో.. అలాగే గణపతుల బావి వద్ద మార్గంలోని రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, శోభాయాత్ర సజావుగా జరగడానికి అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. లోపాలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రేపు జరిగే నిమజ్జన శోభాయాత్ర భక్తులకు సురక్షితంగా, సజావుగా మరియు భక్తి భావంతో జరగాలని మేయర్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కార్పొరేటర్లు మనోహర్, నయీం, అమర్, సజ్జత్, కో-ఆప్షన్ సభ్యులు నరేందర్ సింగ్, అశోక్, అవిన్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Municipal Ganesh Mandali | మున్సిపల్ కార్పొరేషన్ లో గణనాథుడికి ఘనంగా పూజలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *