అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Urea Purchase | జిల్లాలోని రైతులు యూరియా(urea), ఎరువులు కొనేందుకు వచ్చినప్పుడు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
Urea Purchase | ఎరువులు దుకాణాలు.. వివిధ సంస్థలు..
జిల్లాలోని ఎరువుల దుకాణాలు, వివిధ సంస్థలు (fertilizer dealers) రైతులు ఒత్తిడి చేసినట్లు సమాచారం తెలిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కలెక్టర్ (collector warning) తెలిపారు. యూరియా ఎరువులు కొనుగోలు చేసేందుకు వచ్చే పలువురు రైతులకు (farmer welfare) నానో యూరియా కొనుగోలు చేయాలని కొంతమంది ఎరువుల దుకాణాదారులు, వివిధ సంస్థల వారు ఒత్తిడి చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందన్నారు. రైతులు కోరిన ఎరువులను మాత్రమే వారికి అందించాలని సూచించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తూ రైతులను ఎవరైనా ఒత్తిడి చేస్తే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Hyderabad rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
