Revanth Reddy Comments | ఉత్తర భారత్​ ఆధిపత్యం ఎక్కువగా ఉంది.. సీఎం కీలక వ్యాఖ్యలు

కోహెడ ఫ్రూట్​ మార్కెట్​కు సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులు అన్ని రకాల పంటలు సాగు చేయాలని సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Comments | తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఉత్తర భారత్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉందని, లోక్‌సభ సీట్లు పెంచితే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలు ఉనికి కోల్పేయే ప్రమాదం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. 239 ఎకరాల్లో రూ.2,284 కోట్లతో ఈ మార్కెట్​ను ప్రభుత్వం నిర్మిస్తోంది. కోహెడలో ఔటర్‌ రింగు రోడ్డును ఆనుకుని దీనిని నిర్మాణానికి తాజాగా సీఎం శంకుస్థాన చేశారు. ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేలా ఆధునిక వసతులతో నిర్మించనున్నట్లు తెలిపారు.

Revanth Reddy Comments | రియల్​ ఎస్టేట్ పెరిగింది

సీఎం మాట్లాడుతూ.. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​ నగరానికి పాలు, కూరగాయాలు సరఫరా చేసేదన్నారు. ఔటర్​ రింగ్​ రోడ్డు వచ్చాక రియల్ ఎస్టేట్ పెరిగిందని తెలిపారు. దీంతో వెంచర్లు వెలిసి సాగు కుంటు పడిందన్నారు. దీంతో నగర ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయన్నారు. అంతేగాకుండా పండ్లు, పూలు అమ్ముకునే వారికి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వారి కోసం అంతర్జాతీయ స్థాయిలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరు దేని కోసం వచ్చిన ఇక్కడ దొరికేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.

Revanth Reddy Comments | అన్ని పంటలు వేయాలి

ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని రకాల పంటలు మాత్రమే వేస్తున్నారని సీఎం అన్నారు. వరి, మక్కలు, పత్తి, మిర్చి వంటి పంటలకే రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కూరగాయాలు, పండ్లు, కొత్తిమీర, కరివేపాకు సైతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయన్నారు. రైతులు అన్ని రకాల పంటలు సాగు చేయాలని కోరారు. పండ్ల తోటలు పెంపకం చేపట్టాలన్నారు.

cm

Revanth Reddy Comments | ప్రతిపక్ష హోదా కూడా దక్కదు

హైదరాబాద్​ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్​ రింగ్​ రోడ్డు అవతలకు తరలిస్తామని చెప్పారు. ఫ్యూచర్​ సిటీ నిర్మించి హైదరాబాద్​పై ఒత్తిడి తగ్గిస్తామన్నారు. అయితే బీఆర్​ఎస్​ నాయకులు తాము చేసే అభివృద్ధి పనులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్​ఎస్​ ప్రతిపక్షంలో ఉందని, ఇలాంటి పనులు చేస్తే రానున్న రోజుల్లో ఆ హోదా కూడా దక్కదన్నారు. కారు మూలకు పడుతుందని సెటైర్లు వేశారు. డిసెంబర్​లోగా కోహెడ మార్కెట్​ను అందుబాటులోకి తీసుకు రావాలని సీఎం ఆదేశించారు. రెండేళ్లలో పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలన్నారు. ఈ మేరకు అవసరం అయిన నిధులు విడుదల చేస్తామన్నారు.

దీనిని కూడా చదవండి : India vs Afghanistan Test | అదరగొట్టిన భారత బ్యాట్స్​మెన్​.. భారీ స్కోర్ దిశగా భారత్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *