Bachupally Flyover | తీరనున్న ట్రాఫిక్​ తిప్పలు.. బాచుపల్లి ఫ్లైఓవర్​ ప్రారంభించనున్న సీఎం

బాచుపల్లి ఫ్లై ఓవర్‌ను జూన్ 8న సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్​ తిప్పలు తప్పనున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bachupally Flyover | హైదరాబాద్ (Hyderabad)​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. వాహనాల సంఖ్య సైతం పెరగడంతో ట్రాఫిక్​ ఇబ్బందులు పెరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్​ కారిడార్ల నిర్మాణం చేపడుతోంది. ఇందులో భాగంగా బాచుపల్లి ఫ్లై ఓవర్​ నిర్మాణం పూర్తయింది.

Bachupally Flyover |  రూ.147 కోట్లతో..

నాలుగు లేన్ల బాచుపల్లి ఫ్లై ఓవర్‌ను జూన్ 8న సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. దీంతో మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, బౌరంపేట్ మధ్య సిగ్నల్-ఫ్రీ రాకపోకలు సులభమై వేలాది మందికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 1.3 కిలో మీటర్ల ఈ ఫ్లై ఓవర్​ను సుమారు రూ.147 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్​ అందుబాటులోకి వస్తే మియాపూర్ – గండిమైసమ్మ, ప్రగతి నగర్ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గి, సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుంది.

 

దీనిని కూడా చదవండి: Fine to Farmer | వరి కొయ్యలు కాల్చిన రైతుకు జరిమానా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *