KTR Rythu Bharosa | రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం : కేటీఆర్​

కాంగ్రెస్​ పాలనలో దాదాపు రూ. 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ తీవ్ర విమర్శలు చేశారు. 30 నెలల కాంగ్రెస్​ పాలనలో దాదాపు రూ. 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి సిగ్గు అనిపిస్తలేదా అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ పెట్టారు.

రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే.. పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం అవివేకం అన్నారు.

KTR Rythu Bharosa | ముక్కు నేలకు రాయాలి

KTR Rythu Bharosa

ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన రేవంత్​రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలని డిమాండ్​ చేశారు.72 సార్లు ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్​లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం అందేదని కేటీఆర్​ అన్నారు. యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు ఈ సభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Rythu Bharosa | 9 రోజుల్లో ‘రైతు భరోసా’ పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *