అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం (State Government) నేటి నుంచి రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తాము ఆలస్యంగా రైతు భరోసా వేస్తున్నామని బీఆర్ఎస్ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018-19లో వర్షాకాలంలో మొదటి సారి రైతు బంధు రూ.4 వేల చొప్పున బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు చెక్కులు ఇచ్చారని, అనంతరం ఎన్నికలు కావడంతో నేరుగా ఖాతాల్లో జమ చేశారన్నారు. అప్పుడు రైతుబంధు పూర్తి చేయడానికి 4 నెలల 5 రోజులు సమయం పట్టిందని పేర్కొన్నారు. 2021లో 5 నెలల 11 రోజులు పట్టిందని తెలిపారు. 2021-22లో రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు అమ్మి ఆ పైసలతో రైతుబంధు వేశారని గుర్తు చేశారు.
Rythu Bharosa | రూ.27 వేల కోట్లు ఇచ్చాం
బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో రూ.73 వేల కోట్లు రైతు భరోసా జమ చేశారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 2025 వానాకాలంలో 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు. యాసంగి సీజన్లో రెండు ఎకరాల వరకు ఇచ్చామని, ప్రస్తుతం 9 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాంమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో 27 వేల కోట్లు రైతాంగానికి ఇచ్చిందని వెల్లడించారు.
Rythu Bharosa | రైతుల సంక్షేమం కోసం…
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రైతులకు సన్న వడ్లు బోనస్, పనిముట్లు ఇస్తున్నామని తెలిపారు. ఎరువులకు సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ప్రతి రైతు వేదిక దగ్గర యూరియాపై ఏఈవోలు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Sigachi Blast Compensation | సిగాచి బాధితులను మోసం చేసిన ప్రభుత్వం : హరీశ్‌రావు