అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indus Water | భారత్ సింధు జలాలను అడ్డుకోవడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో ఆ దేశ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.సింధు జలాల ఒప్పందం (IWT) ప్రకారం ఇస్లామాబాద్‌కు దక్కాల్సిన నీటి వాటాను కోరే వారి “చేతులను నరికేస్తామని” పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే. విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాలిక్, పాకిస్థాన్ నీటి వాటాను భారత్ “నియంత్రిస్తోందని” ఆరోపించారు. తమ నీటి వాటాకు అడ్డుపడే వారిని తాము “ఎవరినీ వదిలిపెట్టబోమని” ఆయన పేర్కొన్నారు.
Indus Water | చుక్క నీరు రానివ్వడం లేదు
పొరుగు దేశ ప్రధాని చేతిలో ఒక కుళాయి నియంత్రణ ఉందని మోదీ (PM Modi)ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లోకి ఒక్క చుక్క నీరు కూడా రానివ్వడం లేదన్నారు. పాకిస్థాన్ జనాభాలో 40-50 శాతం మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. ఎగువన ఉన్న దేశానికి దిగువన ఉన్న దేశానికి నీటి ప్రవాహాన్ని ఆపే హక్కు ఉందా అని ప్రశ్నించారు.
Indus Water | రద్దు చేయడం సాధ్యం కాదు

పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుందన్నారు. దానిని ఏకపక్షంగా నిలిపివేయడం, రద్దు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ రాబోయే ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలలోగా సింధు నదీ జలాల్లో తమ వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని భారతదేశం నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో పాక్ మంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్నారు.
ఇది కూడా చదవండి..: Darbhanga Airport | దర్భంగా ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం