అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Land Price | గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని ఐటీ హబ్ సమీపంలోని ఉన్న రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో భూమి రికార్డు ధర పలికింది. తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) భూములు వేలం వేయగా.. కళ్లు చెదిరే ధర పలకడం గమనార్హం.
Hyderabad Land Price | ఇంకా కొనసాగుతున్న వేలం
ఇక్కడ ఎకరం భూమి ధర ఏకంగా ₹237 కోట్లకు అమ్ముడుపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఉన్న సర్వే నంబరు 83/1 లోని ఆరు ఎకరాల 29 గుంటల స్థలానికి వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
ఇదే రాయదుర్గం ప్రాంతంలో గతేడాది ఎకరం ధర గరిష్టంగా ₹177 కోట్లు పలకడం గమనార్హం. కాగా, తాజాగా ఆ రికార్డును అధిగమించి మరో ₹60 కోట్లు అదనంగా పలకడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Revanth Reddy NTR | కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే…..


