అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian Games | ఆసియా క్రీడల్లో భారత ఖాతాలో మరో పతకం చేరింది. స్కీట్ షూటింగ్‌లో అనంత్‌జీత్ సింగ్ నరుకా, పరినాజ్ ధాలివాల్‌ల మిక్స్‌డ్ టీమ్ జోడీ కాంస్యాన్ని తమ ఖాతాలో చేర్చింది.
స్కీట్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఆరు సిరీస్‌లలో భారత్ 44 పాయింట్లు సాధించగా, చైనా 52 పాయింట్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 51 పాయింట్లు సాధించిన దక్షిణ కొరియా రజత పతకాన్ని గెలుచుకుంది. కాగా తాజా పతకంతో భారత్ ఖాతాలో 15 మెడల్స్ చేరాయి. ఇందులో ఒక స్వర్ణం, 6 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. షూటింగ్ విభాగంలోనే ఇండియా 8 పతకాలు గెలుపొందడం గమనార్హం.
Asian Games | మిగతా విభాగాల్లో నిరాశ
భారత్ (India) గురువారం మూడు పతకాలు సాధించింది. వుషులో సిల్వర్, రోయింగ్‌లో బ్రాంజ్, తాజాగా స్కీట్ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకుంది. అయితే మిగతా ఈవెంట్లలో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల సింగిల్స్ స్కల్స్ ఫైనల్‌లో బల్‌రాజ్ పన్వర్ 4వ స్థానంలో నిలిచాడు. మహిళల 200 మీటర్ల కెనూ సింగిల్ సెమీ-ఫైనల్‌లో మేఘా ప్రదీప్ నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
ఇది కూడా చదవండి..: Asian Games Wushu Silver | ఆసియా గేమ్స్.. వుషులో భారత్‌కు రజతం