Hyderabad Metro Ganesh Immersion | గణేష్ నిమజ్జనం వేళ మెట్రో వేళలు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Metro Ganesh Immersion | హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 25న మెట్రో రైలు సేవలను సెప్టెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1:00 గంట వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నిమజ్జన శోభాయాత్రకు వెళ్లే నగరవాసులు రాత్రివేళ కూడా మెట్రో ప్రయాణ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు.

సెప్టెంబర్ 25న అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు తెల్లవారుజామున 1:00 గంటకు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు, భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు సొంత వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణా అయిన మెట్రోను ఆశ్రయించాలని సూచించారు.

Hyderabad Metro Ganesh Immersion | భారీగా తరలిరానున్న భక్తులు..

హైదరాబాద్‌లో జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తుంటారు. ప్రసిద్ధ ఖైరతాబాద్  ( Khairatabad ) మహాగణపతితో పాటు వేలాది విగ్రహాల నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Municipal Ganesh Mandali | మున్సిపల్ కార్పొరేషన్ లో గణనాథుడికి ఘనంగా పూజలు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *