అక్షరటుడే, వెబ్డెస్క్: Hospital Fire Safety | తెలంగాణ (Telangana)లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలుపై అధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్షించారు. ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంద్రి రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. అన్ని ఆరోగ్య, వైద్య కేంద్రాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్‌ల నిర్వహణ, హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు, వాటిని సరిదిద్దే చర్యలపై చర్చించారు.
Hospital Fire Safety | వెంటనే చర్చలు తీసుకోవాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఫైర్ సేఫ్టీ ఆడిటింగ్‌ను కూడా తరచూ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ఫైర్ సేఫ్టీ లోపాలు ఉన్న ఆస్పత్రుల్లో వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Thermal Power Plant | థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద ఉద్రిక్తత