Telangana Land Inquiry | రాష్ట్రంలో భూ అక్రమాలపై విచారణకు కమిటీ ఏర్పాటు

రాష్ట్రంలో భూ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Land Inquiry | తెలంగాణ (Telangana) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో 134 జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్రంలో అనేక భూములు ఆక్రమణలకు గురి అయ్యాయని కాంగ్రెస్​ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​ నేతల ఫామ్​హౌస్​లను సైతం సందర్శించారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కమిటీ ఛైర్​పర్సన్​గా ఐఏఎస్ అధికారి శ్రీదేవసేన, కన్వీనర్‌గా రాజీవ్‌ గాంధీ హనుమంతు, సభ్యుడిగా సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం నియమించింది.

Telangana Land Inquiry | ఈ భూములపై విచారణ

ఈ కమిటీ కేసీఆర్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన భూములపై విచారణ చేపట్టనుంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులపై భూములపై సైతం విచారించనుంది. రంగనాయక సాగర్​ సమీపంలోని భూములు, మల్లన్నసాగర్ భూసేకరణలో అక్రమాలపై, అసైన్డ్ భూముల కొనుగోలు అంశంపై కమిటీ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భూదాన్ భూముల కొనుగోళ్లు, ధరణి పోర్టల్ దుర్వినియోగంపై సైతం పరిశీలించనుంది.

ఇది కూడా చదవండి..: Hospital Fire Safety | హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై సమీక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *