అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sanjay Jaju | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ సంజయ్ జాజును నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీస్‌లో పని చేస్తున్నారు. రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
ఈశాన్య ప్రాంతాల అభివృద్ది కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ జాజును కేంద్రం (Central Govt) మంగళవారం రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. దీంతో కొత్త సీఎస్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని సీనియర్ అధికారుల జాబితాను పరిశీలిస్తోంది. కొత్త సీఎస్‌గా సంజయ్‌జాజుతో పాటు జయేశ్‌రంజన్ పేర్లను ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జాజు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
Sanjay Jaju | 1992 బ్యాచ్

సంజయ్ జాజు 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా గతంలో పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లారు. తాజాగా మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో ఆయనను సీఎస్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. కాగా సంజయ్ 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉంటారు.
దీనిని కూడా చదవండి : Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..