KTR Clarification | క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులు తప్పవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్

గ్లోబరీనా సంస్థతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Clarification | గ్లోబరీనా సంస్థతో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారైనా సీఎంలా ప్రవర్తించాలని హితవు పలికారు. పేపర్ లీక్ ఘటనలపై తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.

KTR Clarification | రేవంత్ రెడ్డి ఆరోపణలు..

కొడంగల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2019లో ఇంటర్ పరీక్షల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకల వల్ల 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదే సంస్థ పేరు మార్చుకుని, కేటీఆర్ సహకారంతో కేంద్రంతో కుమ్మకై సీబీఎస్ఈ కాంట్రాక్టులు దక్కించుకుందని విమర్శించారు.

KTR Clarification | కేటీఆర్ ఘాటు స్పందన..

సీఎం ఆరోపణలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఖండించిన కేటీఆర్.. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తన లీగల్ టీమ్ ద్వారా సీఎంకు చట్టపరమైన నోటీసులు పంపుతామని హెచ్చరించారు. అసంబద్ధమైన ఆరోపణలన్నింటికీ తాను స్పందించనని, బురదలో కుస్తీ పట్టడం ఇష్టంలేకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: Rahul Gandhi Demands | యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే.. మోదీపై రాహుల్ గాంధీ ఆగ్రహం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *