అక్షరటుడే, వెబ్డెస్క్ : Mutyam Venkataramana Remand | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
రెడ్కోకో డీఈగా పనిచేస్తున్న వెంకటరమణ నివాసాలలో ఏసీబీ అధికారులు (ACB Officers) బుధవారం దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. తనిఖీల సమయంలో వెంకటరమణ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. తన భార్య పేరిట పలు కన్స్ట్రక్షన్ కంపెనీలు, అనేక భవనాలు, ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Mutyam Venkataramana Remand | ఏసీబీ కోర్టులో హాజరు పర్చగా..
డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రిమాండ్ విధించారు. దీంతో చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా ఏసీబీ అధికారులు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్రలో అత్యంత భారీ అవినీతి కేసును వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఎస్పీడీసీఎల్లో పని చేస్తున్నప్పుడు 2019లో రూ.25,000 లంచం తీసుకుంటూ రమణ గతంలో రెడ్-హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉండగా, తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో రూ.28.14 కోట్ల (రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం) అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఇది గతంలో ఆర్అండ్బీ ఈఎన్సీకి సంబంధించి నమోదైన రూ.17.94 కోట్ల రికార్డును అధిగమించింది. కాగా డీఈ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.300 కోట్లకు పైగా ఉంటాయని అంచనా..
ఇది కూడా చదవండి..: Indiramma Houses | త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు!