Medical Student Suicide | ఉప్పల్‌లో మెడికో ఆత్మహత్య

ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న కె భరద్వాజ్​ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medical Student Suicide | ఉప్పల్​ పోలీస్​ స్టేషన్ (Uppal Police)​ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఉస్మానియాలో వైద్య విద్య చదువుతున్న కె భరద్వాజ్​ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రామంతపూర్​కు చెందిన భరద్వాజ్​ (18) ఉస్మానియా మెడికల్ కాలేజీ (Osmania Mecal College)లో ఎంబీబీఎస్​ ఫస్టియర్​ చదువుతున్నాడు. పీఎస్‌ కాలనీలో నివాసం ఉంటున్న అతడు శనివారం అర్ధరాత్రి 1.30 గంటల వరకు తన సోదరితో కలిసి చదువుకున్నాడు. అనంతరం అందరు నిద్ర పోతుండగా బయటకు వెళ్లాడు. తెల్లవారుజామున 3:20 గంటలకు భరద్వాజ్​ ఇంట్లో కనిపించలేదు. దీంతో ఆంఓదళనకు గురైనా కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువులకు ఫోన్​ చేశారు. పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Medical Student Suicide | నిర్మాణంలో ఉన్న భవనం వద్ద..

ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఎన్‌ఎస్‌ఎల్‌ నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఓ యువకుడు కిందపడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా మృతి చెందిన వ్యక్తి భరద్వాజ్‌గా గుర్తించారు. అయితే అర్ధరాత్రి అతడు అక్కడికి ఎందుకు వెళ్లాడనే విషయాలు తెలియరాలేదు. ఆ సమయంలో ఒక్కడే ఉన్నాడా.. మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

దీనిని కూడా చదవండి : Karnataka CM DK Shivakumar | ఏ సంస్థ అయినా చట్టాన్ని పాటించాల్సిందే : కర్ణాటక సీఎం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *