అక్షరటుడే, బాల్కొండ: Youth Harassment Case | పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని వేధించిన కేసులో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ మేరకు బాల్కొండ (balkonda) ఎస్సై యాసిర్ అరాఫత్ వివరాలు వెల్లడించారు.
Youth Harassment Case | తరచూ వేధించడంతో..
మండలానికి చెందిన రియాజ్ అనే వ్యక్తి తరచుగా ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని వేధించడంతో ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు నిజామాబాద్ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై యాసిర్ అరాఫత్ మాట్లాడుతూ.. ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లేదా చులకన భావంతో మాట్లాడిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి.. నువ్వు ఎవరిని ఉద్ధరించినవ్..: KTR