Government Employees Issues | ​ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వం ​ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్​ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Government Employees Issues | ప్రభుత్వం ​ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో (TNGO) కేంద్ర కార్యాలయంలో ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని అధ్యక్షతన టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

Government Employees Issues | ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక చర్చ

సుమన్​ కుమార్​ మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలను (DA) విడుదల చేసేలా కృషి చేసిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ​ఇదే ఉద్యమ పటిమతో ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ (PRC), పెండింగ్ డీఏలతో పాటు ఇతర సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని కోరారు. ​ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌ను పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో తరచుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, కొంతమంది ఉన్నతాధికారుల అలసత్వం వల్ల నూతన విధానం సరిగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని సరిదిద్ది ఉద్యోగులకు కొత్త హెల్త్ విధానాన్ని సమర్థవంతంగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Government Employees Issues | సీపీఎస్ రద్దు..ఓపీఎస్ పునరుద్ధరణ

ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని (CPS) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) తక్షణమే అమలు చేయాలని సుమన్​ కుమార్​ డిమాండ్ చేశారు. ​ఉద్యోగుల సంక్షేమం, శ్రేయస్సు కోసం టీఎన్జీవో కేంద్ర సంఘం తీసుకునే ప్రతి నిర్ణయానికి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని నాశెట్టి సుమన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sports Development in Schools | ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *