Sports Development in Schools | ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Sports Development in Schools | క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ మండలం కంజర్​లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల (బాలుర)లో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.

Sports Development in Schools | ఉచిత విద్యతో పాటు క్రీడలపై దృష్టి..

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ (Nizamabad) రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్​లో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారంతా మట్టిలో మాణిక్యాలని కొనియాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, క్రీడా వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని, పాఠశాలకు అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని సైతం త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు.

Sports Development in Schools | సమస్యలు పరిష్కరిస్తాం..

పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు, విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భూపతిరెడ్డి తెలిపారు. విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతకుముందు పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డికి స్థానిక విద్యార్థులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సరస్వతీ మాత చిత్రపటం వద్ద పూజలు నిర్వహించి, క్రీడా జ్యోతిని వెలిగించి జిల్లా స్థాయి క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు అగ్గు భోజన్న, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Towers Scheme | అర్బన్​లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం.. ఫ్లాట్ల కేటాయింపులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *