అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka CM DK Shivakumar | ప్రభుత్వ స్థలాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి తప్పనిసరి అనే నిబంధనపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ (BL Santosh) వ్యక్తం చేసిన అభ్యంతరంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తాము ఎప్పుడూ ఏదో ఒక అంశాన్ని పట్టుకుని రాజకీయాలు చేయలేదన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏ సంస్థ అయినా చట్టాన్ని పాటించాల్సిందే అని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతూ దరఖాస్తు వస్తే, నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతి, భద్రతను కల్పిస్తామని డీకే శివకుమార్ తెలిపారు. ‘ఫ్రీడమ్ ఫెస్టివల్’ నిర్వహించడానికి కృష్ణ బైరే గౌడ కూడా ప్రభుత్వ అనుమతి తీసుకున్నారని తెలిపారు. చట్ట పరిధిలో కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ, ఖర్గే వచ్చినప్పుడు ఫ్రీడమ్ పార్క్ నుంచి ర్యాలీ నిర్వహించడానికి తమకు అనుమతి లభించలేదని ఆయన గుర్తు చేశారు. దీంతో కోర్టు నుంచి అనుమతి పొందాల్సి వచ్చిందన్నారు.
Karnataka CM DK Shivakumar | ప్రత్యేక పూజలు
డీకే శివకుమార్ కొడగు జిల్లాలోని భాగమండల వద్ద ఉన్న భగండేశ్వర ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను ఆలయంలో పూజలు చేసినట్లు తెలిపారు. తన ప్రార్థనలు ఫలించాయన్నారు. కావేరీ నదీ జలాల వివాదంపై ఆయన స్పందించారు. తాము చట్టాన్ని పాటించాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించామన్నారు. తీర్పు తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దీనిని కూడా చదవండి : India vs Sri Lanka | శ్రీలంకతో టెస్ట్.. భారత్ భారీ స్కోర్