India vs Sri Lanka | శ్రీలంకతో టెస్ట్.. భారత్ భారీ స్కోర్

శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్​లో భారత్​ భారీ స్కోర్​ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs Sri Lanka | శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్​లో భారత్​ భారీ స్కోర్​ చేసింది. వర్షం కారణంగా రెండో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం అయింది. ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 460 పరుగులు చేసింది.

శ్రీలంక పర్యటనలో భాగంగా తొలిటెస్ట్​లో టాస్​ గెలిచిన భారత్​ బ్యాటింగ్​ ఎంచుకుంది. తొలిరోజు 2 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. రెండో రోజు భారీ వర్షంతో మ్యాచ్​ ఆలస్యంగా మొదలు అయింది. దాదాపుగా ఒకటిన్నర సెషన్లు వర్షంతో తుడిచిపెట్టుకుపోయాయి. 43 ఓవర్లు మాత్రమే మ్యాచ్​ సాగగ భారత్​ 172 పరుగులు చేసి, 7 వికెట్లు కోల్పోయింది.

India vs Sri Lanka | పడిక్కల్ సూపర్ ఇన్నింగ్స్​

భారత బ్యాటర్​ శ్రీలంక (India vs Sri Lanka) బౌలర్లపై విరుచుకుపడ్డారు. యశశ్వి జైస్వాల్ (Jaiswal)​ 32 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్​ 82 రన్స్​ కొట్టాడు. దేవదుత్​ పడిక్కల్ (Padikkal) భారీ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. 230 బంతుల్లో 167 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఒక సిక్స్​ ఉన్నాయి. డబుల్​ సెంచరీ దిశగా సాగుతున్న పడిక్కల్​ను ప్రభాత్​ జయసూర్య ఔట్​ చేశాడు. కెప్టెన్​ గిల్​ 16 పరుగులకే వెను తిరిగినా.. రిషబ్​ పంత్ 39, ద్రువ్​ జురేల్​ 51 పరుగులతో సత్తా చాటారు. ప్రస్తుతం క్రీజులో కులదీప్​ యాదవ్​ (12), ప్రసిద్​ కృష్ణ (1) ఉన్నారు. భారత్​ ఈ మ్యాచ్​లో గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్​ బరిలో ఉంటుంది. డ్రా అయినా రేసులో ఉండదు. దీంతో మూడో రోజు ఆట కీలకం కానుంది.

 

దీనిని కూడా చదవండి : Amit Shah Sonia Gandhi | దేశ ప్రజలకు సోనియా గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి: అమిత్‌షా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.